ఉత్తాన పాదాసనం, నౌకాసనం

పొట్టను తగ్గించే యోగ:

ఉత్తాన పాదాసనం, నౌకాసనం అనే ఈ రెండు ఆసనాలనురెండు పూటలా చేస్తే చాలా త్వరగా పొట్ట కరిగిపోతుంది.

ఉత్తాన పాదసనం.

ఉత్తాన అంటే పైకి అని, పాద అంటే పాదాలు.. కాళ్ళను పైకి ఎత్తి ఉంచడం వలన దీనిని ఉత్తాన పాదసనం అంటారు.

ఉత్తాన పాదాసనం చేయు విధానం:

A) వెల్లకిలా పడుకొని చేతులను తొడలకు ప్రక్కగా, అరచేతులు నేలకు తగిలినట్లు ఉంచి రెండు కాలి బొటనవేళ్లను కలిపి కాళ్ళను చాచవలెను.B) గాలి పీలుస్తుా ఎడమ కాలిని మెాకాలు వంచకుండా నెమ్మదిగా కాలిని 45° కోణంలో పైకి ఎత్తి సుఖముగా ఉండగలిగినంతసేపు ఉంచవలెను.

C) ఉత్తాన పాదాసనం రెండు కాళ్ళను 30 డిగ్రీల కోణం లో ఎత్తి పెట్టి ఉంచాలి . కింద ఉండే బొజ్జ దీని వలన తగ్గుతుంది . కడుపులో వణుకు వస్తూ ఉంటుంది . మొదట్లో 10 – 15 సేకనులతో మొదలు పెట్టండి . రోజు రోజుకీ సమయం పెంచండి. 15 రోజులలోనే మీకు తేడా తెలుస్తుంది

నౌకాసనం:

ఈ ఆసనంలో శరీరం నౌకాను పోలి ఉండటం వల్ల దీనికి నౌకాసనం అనే పేరువచ్చింది.

D)వెల్లకిలా పడుకొని చేతులను తొడలకు ప్రక్కగా, అరచేతులు నేలకు తగిలినట్లు ఉంచి రెండు కాళ్ళను కలిపి చాచవలెను.
కాళ్ళను, తలను చేతులను నేల నండి పైకి లెపవలెను.
ఉండగలిగినంతసేపు ఉంచి నెమ్మదిగా దించేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవాలి.ప్రయోజనాలు:

ఉత్తాన పాదసనం, నౌకాసనంల ద్వారా పొట్టపై భారం కలుగాచేయ్యడం ద్వారా పొట్ట కండరాలను టోనింగ్ చెయ్యడం జరుగుతుంది . బొడ్డుకు దిగువన ఉండే పోతాభాగం పై ఒత్తిడి కలిగి ఆ భాగం చక్కగా తయారు అవుతుంది . బొజ్జ తగ్గుతుంది. నడుము, పిరుదులు, తొడల యందున్న అధిక క్రొవ్వు తొలగి సన్నబడతాయి. పొట్ట కరిగిపోతుంది.

సూచనలు:

పొట్టలో పేరుకుపోయిన కొవ్వుతగ్గాలంటే ఆహారపుఅలవాట్లను మార్చుకోవాలి. పొట్ట తగ్గడం కోసంచాలామంది తిండి తినడంమానేస్తుంటారు. ఇది సరైనపద్ధతి కాదు. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌ తినడాన్ని బాగాతగ్గించాలి. వీటిల్లో అధికపాళ్లలో సోడియంఉంటుంది. ఇది శరీరానికిమంచిది కాదు.
రాత్రి పూట 10-11గంటల సమయంలో తినడం చేయకూడదు.
ఎప్పుడు నీళ్లు తాగినా పొట్టఖాళీగా ఉన్నప్పుడు తాగితేపొట్ట ముందుకు సాగదు, ఎక్కువ కూరతో తినాలి.

గ్రీన్ టీ రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. రోజూ సుమారు 8 నుంచి 10గ్లాసుల నీళ్లు తాగాలి. దీనివల్ల మెటబాలిజమ్ రేట్ పెరిగి,అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *