ఉష్ట్రాసనం-ఆస్త్మాన్ని తరిమికొట్టే ఆసనం

ఆస్త్మాన్ని తరిమికొట్టే ఉష్ట్రాసనం:

ఆస్త్మా అనేది తరచూ శ్వాస ఆడకపోవడం, ఛాతీ బిగుసుకుని పోవడం మరియు దగ్గు వంటి లక్షణాలతో దీర్ఘకాల వ్యాధి. ఈ ఆస్త్మా లక్షణాలు ఎక్కువగా తెల్లవారు జామున లేదా రాత్రి సమయాల్లో కనిపిస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా 235 మిలియన్ మంది వ్యక్తులు ఉబ్బసంతో బాధపడుతున్నారు. భారతదేశంలో సుమారు 15-20 మిలియన్ మంది వ్యక్తులు ఉబ్బసంతో బాధపడుతున్నారు. ఉబ్బసం అనేది సాధారణంగా చిన్న వయస్సులోనే ప్రారంభమవుతుంది, అన్ని వయస్సుల వ్యక్తులు దీని బారిన పడతారు.ఆస్త్మా అనేది గాలి ప్రసార నాళాల వాపు మరియు కుచించుకుని పోవడం వంటి దీర్ఘకాల లక్షణాల గల ఉపిరితిత్తుల వ్యాధి. ఇది పర్యావరణ మరియు జన్యు పరమైన కారణాలు వలన సంభవిస్తుంది. ఆస్త్మా ను యోగ ద్వారా నియంత్రించ వచ్చును.

ఉష్ట్రాసనం:

సంస్కృతంలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. ఈ ఆసనంలో శరీరం ఒంటెను పోలి ఉండుట వల్ల దీనీకి ఉష్ట్రాసనం అన్ని పేరు వచ్చింది.

ఉష్ట్రాసనం చేయు విధానం :

A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

B) మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో వాటిని ఉంచండి. కాలివేళ్లు, మడమల ఆధారంగా కూర్చొనండి. నడుము కింది భాగంలో వీలైనంత వెడల్పుగా ఉంచండి. అరచేతులను సంబంధిత మోకాళ్ల మీద ఆనించాలి. ఈ విధంగా వజ్రాసనంలో కూర్చోవాలి.C) మోకాళ్ళ మీద నిలబడాలి, శరీరం, వెన్నెముక, మెడ సమాంతరంగా ఉంచాలి.

D) మోకాళ్లమీద శరీరాన్ని వెనుకకు వంచి కుడి మడమను మీ కుడి చేతితోనూ, ఎడమ మడమను ఎడమ చేతితోనూ పట్టుకోవాలి.మడమలను గట్టిగా పట్టుకుని నడుము మరియు తొడలను వెనక్కు వంచాలి. తలను, మెడను వీలైనంతగా వెనక్కు వంచాలి. కటి భాగాన్ని, నడుమును కొద్దిగా ముందుకు నెట్టాలి. శ్వాసను మామూలుగా పీల్చి వదులుతూ ఈ స్థితిలో అలాగే ఉండి, తర్వాత ఈ స్థితినుంచి బయటకు వచ్చి,

E) చేతులను ముందుకు ఉంచి శరీరాన్ని పొజిషన్లో ఉంచండి. తర్వాత దండాసనలొ కొద్దసేపు విశ్రాంతి తీసుకోవాలి.

ఉష్ట్రాసనం ప్రయోజనాలు:

మడమలు, తొడలు, శరీరం, ఛాతీ, గొంతు, కటి, పొత్తి కడుపులను దృఢంగా ఉంచడానికి ఈ భంగిమ చాలా మంచింది. ఇది మెడ, పొత్తికడుపు అంగాలను నియంత్రిస్తుంది. ఈ భంగిమ ఉబ్బసం దుష్ప్రభావాలను తొలగించి, శ్వాస కోశాలను, ఊపిరితిత్తుల పనితీరును, ముక్కు నాళికను, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. పదే పదే వచ్చే తలనొప్పి, గొంతు సమస్యలు, టాన్సిల్స్‌ను నిరోధించి, నివారిస్తుంది. గుండె, మేరుదండం, నడుము, చాతి, గర్భాశయం పటిష్టమవుతాయి. థైరాయిడ్ సమస్య, సర్వాయికల్ సమస్య తొలగును. ఋతుక్రమం సక్రమమగును. స్త్రీ ప్రసవం తర్వాత సాగిన అవయవములు త్వరగా పూర్వపుస్ధితికి వచ్చును. ముఖం కాంతివంతమగును. వయస్సు పెరుగుదల తగ్గినట్లుండును. కాళ్ళు, తొడలు, చేతులు, భుజాలు బలోపేతమగును. శ్వాస సంబంధమైన ఆస్త్మా, అలర్జీ, సైనస్ వంటి సమస్యలు తొలగును.

జాగ్రత్తలు:

చీలమండ గాయం, మోకాళ్ల నొప్పులు ఉన్న వాళ్లు చేయకూడదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *