గోముఖాసనం

కీళ్లనొప్పులు తగ్గించే గోముఖాసనం

ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్య కీళ్లనొప్పులు. వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరగడం కారణంగా.. కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనివల్ల ఎముకలు చాలా బలహీనమవుతాయి. కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉండేవాళ్లకు కూడా కీళ్లనొప్పుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వయసు పెరిగేటప్పుడు వచ్చే మార్పులు కూడా కీళ్ల నొప్పులు, అరుగుదలకు కారణమవుతాయి.
కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్లు కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యత , థైరాయిడ్‌ ప్రభావం, సొరియాసిస్‌, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కూడా కీళ్లనొప్పులు రావడానికి కారణమవుతాయి. అధిక బరువు, ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పుల వంటి అలవాట్లు కూడా కీళ్లనొప్పుల సమస్యకు కారణమవుతాయి.
అయితే కీళ్లనొప్పులు ఉన్న వాళ్ల సమస్య అంతా ఇంతాకాదు. ఎన్ని మందులు వాడుతున్నా.. కదల్లేని పరిస్థితి ఉంటుంది. కూర్చోలేరు. నిలబడలేరు. ఎక్కువగా నడవలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు యోగ చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.గోముఖాసనం : ఈ ఆసనంలో శరీరం ఆవు ముఖమును పోలి ఉండుట వల్ల దీనీకి ఆ పేరు వచ్చింది.

గోముఖాసనం చేయు విధానం :

A) నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి.

B) కుడి కాలు తీసి, ఎడమ మోకాలు మీద కుడి మోకాలు వుంచాలి. రెండు మోకాళ్ళు బాగా దగ్గరగా కలిసేటట్లు కాళ్ళను ఉంచాలి.

C) కుడి మోచేతిని పైకి ఎత్తి ఎడమ చేత్తో కుడి చేతిని వీపు వెనుక నుంచి పట్టుకోవాలి. మెడ, నడుమును నిఠారుగా ఉంచాలి.
అదే విధంగా కాళ్ళు చేతులు మార్చి గోముఖాసనం చేయాలి.సూచన : ప్రారంభంలో చేతులు పట్టుకోవడం సాధ్యం కాకపోతే రుమాలును సాధనంగా ఉపయోగించాలి.
కుడి కాలును ఎడమకాలి పై నుంచి మడిచి వెనక్కి తీసుకెళ్లాలి. ఎడమ కాలు ను లోపలి వైపు నుంచి మడిచిపెట్టాలి.

గోముఖాసనం లాభాలు :
పొట్టలోని అవయవాలకు, పొట్ట కండరాలకు, వెన్నెముకకు లాభకారి. గ్రంధుల్లో చురుకుతనం తెస్తుంది. మెడ నొప్పులు తగ్గుతాయి. మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపోటు, హెర్నియాలకు ఈ ఆసనం పనిచేస్తుంది. శరీర అవయవాల సంధుల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పొట్ట మరియు వెన్నుపూస కండరాలు గట్టిబడతాయి. మెడ నొప్పులు నివారించబడతాయి. ఈ ఆసనం ద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. మోచేతులు, మోకాళ్లు, నడుము మొదలగు జాయింట్‌లలో నొప్పి త‌గ్గుతుంది.
భుజాలు, చేతులు, మెడ నరాల సమస్య, తుంటి సమస్యలు , జననేంద్రియ సమస్యలు నివారించుకోవచ్చు, వీపుకండరాలు, ఎముకలు బలోపేతమగును. ఋతుక్రమము సక్రమమగును, అధిక మూత్రసమస్య తొలగును.

గోముఖాసనం జాగ్రత్తలు:

సర్వికల్‌ స్పాండిలైటిస్‌, గుండెజబ్బులూ, సయటికా వున్న వారు చేయకూడదు.
అధిక బరువు ఉన్నవాళ్లు జాగ్రత్త చేయాలి.
భుజం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaOne Reply to “గోముఖాసనం”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *