గ్రీవ సంచలన ఆసనాలు

మెడ ఆకృతి, ఆరోగ్యాన్ని పెంచే యోగా

మెడ ముఖానికి అందాన్ని జతచేస్తుంది.ఒత్తిడి మెడ కండరాలను బిగుతుపరిచి, కండరాల అలసటకు దోహదం చేస్తుంది.యోగ ఆరోగ్యమైన   మెడను పొందుటకు సహాయపడుతుంది.మెడకు మంచి ప్రయోజనాలు పొందుటకు యోగాభ్యాసం దోహదం చేస్తుంది.

మెడ సన్నని కాండంలాంటి అవయవం,  తలకి ఇరువైపులా మద్దతును ఇవ్వడంతో పాటు, తలను పైకి మరియు క్రిందికి వంచడానికి మరియు దాదాపు 180 డిగ్రీల వరకు తిప్పడానికి అనుమతిస్తుంది. మెడపై నిరంతర కదలికల కారణంగా చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలు, దుస్తులు మరియు బయటి వాతావరణం  వలన కలిగే ఘర్షణ వంటివి చాలా ప్రభావితం చేస్తాయి. రోజువారీ అలవాట్లు కూడా చర్మం కుంగిపోవడానికి దోహదం చేస్తాయి. ఒక ఇబ్బందికరమైన స్థితిలో నిద్రించడం, హఠాత్తుగా పడుకోవడం, చెవికి మరియు భుజానికి మధ్య సెల్ ఫోన్ ను నొక్కి పట్టడం, కోపం, భయం లేదా మానసిక ఒత్తిడి వంటివి మెడ కండరాలు బిగుసుకు పోవడానికి, కండరాల అలసటకు దోహదం చేస్తాయి.

మెడను నాణ్యతతో మరియు ఆరోగ్యాంతో కొనసాగించటానికి కొన్ని ప్రత్యేక ఆసనాలు చేయాల్సిన అవసరం ఉంది.

(గ్రీవ అనగా సంస్కృతిలో మెడ)

“గ్రీవ సంచలన ఆసనాలు”

 భుజాలను ముందుకు ఉంచి, కళ్ళను నెమ్మదిగా మూసుకొని మెడకు విశ్రాంతి  పొందే విధంగా నిటారుగా కూర్చోవాలి.A)మెడను ముందుకు మరియు వెనుకకు వంచండి:

ముఖ కండరాలకు విశ్రాంతిని కల్పించే విధంగా తలను నెమ్మదిగా వెనుక భాగంకు అనగా వీపు వైపు వంచాలి. నెమ్మదిగా తలను యదాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు తలను నెమ్మదిగా వీలైనంత వరకు ముందుకు వంచండి. నెమ్మదిగా తిరిగి యదాస్థానానికి తీసుకురండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.

B)భుజం వైపు చెవిని వంచండి:

భుజాలని ఎత్తకుండా తలను నెమ్మదిగా ఎడమవైపుకు వంచండి మరియు ఇపుడు తలను పైకి ఎత్తి యదాస్థానానికి తీసుకురావాలి. ఇపుడు తలను మధ్య భాగం నుండి కుడి వైపుకు వంచాలి మరియు యదాస్థానానికి తీసుకురావాలి. ఈ విధంగా మెడను వంచినపుడు మెడ కండరాలు దాని వ్యతిరేకపు వైపుకు లాగినట్లుగా అన్పిస్తుంది. మెడను కుడి వైపు వంచినపుడు ఎడమవైపు మెడ కండరాలు లాగినట్లుగా అన్పిస్తుంది మరియు అటు వంచితే ఇటు, ఇటు వంచితే అటు మారుతుంది. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.

C)ప్రక్క ప్రక్కనకు తిప్పుట:

భుజాలను అలానే ఉంచుకుని మరియు తలను నిటారుగా చాలా నెమ్మదిగా మరియు సమానంగా మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు కుడి వైపునకు తిప్పండి, కొన్ని సెకన్ల పాటు అలానే ఉండండి మరియు తలను ఇపుడు యదాస్థానానికి తీసుకురండి. ఇప్పుడు నెమ్మదిగా మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు  మాత్రమే ఎడమ వైపునకు తిప్పండి. కొన్ని సెకన్ల పాటు అలానే ఉండండి మరియు తలను ఇపుడు యదాస్థానానికి తీసుకురండి. ఈవిధంగా తలను తిప్పినపుడు కండరాలు సంకోచం చెందుతాయి మరియు తిరిగి యధాస్థితికి వచ్చినపుడు విశ్రాంతి పొందుతాయి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.

D)మెడను తిప్పడం (సవ్యదిశలో మరియు అపసవ్యదిశలో)

మెడను విశ్రాంతి పొందేవిధంగా ఉంచుతూ మరియు మీ భుజాలు ముందు వైపుకు ఉంచి తల క్రిందికి వంచండి మరియు కుడి చెవి వరకు కుడి భుజానికి దగ్గరగా వచ్చేంతవరకు తలను కుడి వైపు తిప్పుతూ ఉండండి (భుజాన్ని పైకి ఎత్తకూడదు) మీకు సౌకర్యవంతంగా ఉన్నతవరకు తిప్పుతూ ఉండండి మరియు ఇపుడు ఎడమ చెవి ఎడమ భుజానికి సమీపానికి వచ్చేంతవరకు తలను ఎడమ వైపుకు తిప్పుతూ ఉండండి మరియు ఒక వలయాకారంను పూర్తి చేస్తూ తలను ప్రారంభ స్థానంకు తీసుకురావాలి. ఇది ఒక పర్యాయం. సవ్యదిశలో ఐదు మార్లు మరియు అపసవ్యదిశలో ఐదు మార్లు చేయండి.

E)భుజాలను పైకెత్తడం.

ముఖాన్ని ముందు వైపు ఉంచాలి మరియు మెడను ముందు వైపు చూస్తున్నట్లుగా ఉంచి భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, నెమ్మదిగా మరియు శాంతముగా రెండు భుజాలను చెవుల వైపుకు ఎత్తండి మరియు నెమ్మదిగా, తిరిగి ప్రారంభ స్థానంకు వచ్చేయండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.

F)దవడలను నొక్కిపట్టుట.

మీ నోరు తెరిచి మరియు మీకు వీలున్నంతవరకు నాలుకను బయటకు తీసుకురండి, నాలుక కొన వైపు గురిపెట్టండి. మీ మెడ కండరాలు బిగుసుకున్న అనుభూతిని పొందాలి, మీ మెడ యొక్క నరాలు బయటకు కన్పించేంతవరకు మీ దవడలను గట్టిగా నొక్కిపట్టండి. మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు ఈ విధంగానే నొక్కి పట్టుకోండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.G)ముఖాన్ని ముందు వైపు ఉంచాలి మరియు భుజాలకు విశ్రాంతిని కల్పిస్తూ, మీ మెడ ముందు కండరాలను సంకోచింపచేయాలి. వాటిని దృఢంగా మరియు బిగువుగా చేయడానికి ప్రయత్నించండి. మీ దంతాలను బిగుతుగా నొక్కి పట్టి ఉంచాలి మరియు మీ మెడ యొక్క నరాలు బయటకు కన్పించేంతవరకు మీ దవడలను గట్టిగా నొక్కిపట్టండి. ఇది ఒక పర్యాయం. ఈ విధంగానే 10 పర్యాయాలు చేయండి.

ప్రయోజనాలు:

ఒక రోజులో కొన్ని నిమిషాలు “గ్రీవ సంచలన ఆసనాలు” అభ్యసించడం ద్వారా కఠినమైన, సున్నితమైన మరియు ఒక చక్కని బిగుతైన మెడను పొందవచ్చు. నిద్ర, దృష్టి  మరియు వినికిడి సామర్ధ్యాలను మెరుగుపరుస్తుంది, మరియు మెడ నరాలు మెదడుకు అనుసంధించబడి ఉంటాయి కావున తలనొప్పిని నిరోధిస్తుంది.

థైరాయిడ్ గ్రంధి బాగా ఉత్తేజితమై అది స్రవించు హార్మోన్ లను క్రమపరచబడును.

జీవక్రియలను నియంత్రించి క్రమపరచబడును.

ఎముకలు దృడముగా అగును.

జాగ్రత్తలు

వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వేయవచ్చు.

మెడ వ్యాయామాలను నెమ్మదిగా కదులుతూ, సజావుగా మరియు కండరాలు అదిమి పట్టకుండా జాగ్రత్తగా  చేయండి. అధిక బిపి, సెర్వికల్ స్పాండిలైటిస్, గర్భంతో ఉన్నవారు ఎక్కువగా వెనక్కి లేదా ముందుకు వంగకుండా జాగ్రత్తగా చేయాలి. ముక్కు ద్వారా శ్వాసను నెమ్మదిగా తీసుకోవాలి. మీరు ఒక నిర్దిష్ట స్థానంలో ఉన్నపుడు నొప్పిని కనుగొంటే వెంటనే ఆ వ్యాయామం ఆపి వేయండి. వ్యాయామ నియమావళిని నిర్దేశించుకొని క్రమం తప్పకుండా వీటిని అభ్యసించండం ద్వారా అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *