తాడాసనం-శరీరాకృతిని మెరుగుపరుచుకునే యోగ

మీ శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం యోగానే, మీరు మీ శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి. మానసిక ప్రశాంతతను యోగ ద్వారా పొందవచ్చు. ఆరోగ్యం, శరీరాకృతి మరియు ఫిట్నెస్ కోసం తాడాసన సిరీస్ ఉపయోగపడుతుంది.తాడాసనం:
తాడ అంటే సంస్కృతంలో పర్వతమని అర్థం. యోగప్రక్రియలో కదలకుండా సమస్థతిలో నిలబడి చేసేదే తాడాసనం.

తాడాసనం:

ఆసనం వేయు పద్దతి :
A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి నిటారుగా ఉండాలి.
మోకాళ్ళు, తొడలు, పిరుదలు, ఉదర భాగంలోని కండరాలను కొద్దిగా బిగుతుగా ఉండేలా చూడాలి. స్థిర స్థితిలో ఉండాలి. ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవాలి.

B) అలాగే భుజాలను పైకి లేపి చేతులను కలపాలి. అదేసమయంలో కలిపిన అరచేతులు ఆకాశాన్ని చూస్తూ ఉండాలి.

C) ఈ విధంగా చేసే సమయంలో కాలివేళ్ళపై నిలబడుతూ పైకి లేవాలి. కొద్ది సమయం అలాగే ఉన్న తరువాత మెళ్ళగా గాలి వదులుతూ పూర్వ స్థితికి రావాలి. తరువాత కాళ్ళను దూరం చేస్తూ విశ్రాంతి తీసుకోవాలి.

పార్శ్వ తాడాసనం:

A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి చేతులు రెండు పైకెత్తి రెండు చేతివేళ్ళను ఒక దానితో ఒకటి చొప్పించి అరచేతులు పైకి ఉండునట్లుగా త్రిప్పాలి.

D) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని కుడి ప్రక్కకు వంచాలి.శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి.

E) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని ఎడమ ప్రక్కకు వంచాలి.శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి.తిర్యక్ తాడాసనం:
A) రెండు పాదముల మధ్య కొంచెం దూరముగా ఉండునట్లుగా నిలబడి చేతులు రెండు పైకెత్తి రెండు చేతివేళ్ళను ఒక దానితో ఒకటి చొప్పించి అరచేతులు పైకి ఉండునట్లుగా త్రిప్పాలి.

F) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని కుడి ప్రక్కకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి.

G) కాళ్ళు కదపకూండా శ్వాస విడిచిపెడుతూ నడుము పైభాగాన్ని ఎడమ ప్రక్కకు తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెుదటి స్థితికి రావాలి.

ప్రయోజనాలు:
మలబద్ధకం పోగొట్టును, శరీరమంతా పూర్తిగా సాగడం వలన కండరాలు, నరాలు, ప్రేగులు, వెన్నెముక ఉత్తేజితమై శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చేతులు, కాళ్లు, నడుము బలంగా తయారవుతాయి. కండరాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. శ్వాస చక్కగా జరుగుతుంది. శరీరం బలిష్ఠంగా తయారవుతుంది. జీర్ణాశక్తిని పెంచును, మానసిక ఒత్తిడులను తొలగిస్తుంది.
శరీరానికి చక్కటి ఆకృతిని ఇస్తుంది.మెరుగైన అరోగ్యం, శరీరాకృతిని పొందాలంటే:
సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి. పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న వంటి పదార్దాలు లేని ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం. రోజుకి 30 నిమిషాలు యోగ చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది. మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు, క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది. ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.వ్యాయామం చేయడం చాలా అవసరం. ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 2-3 Lts నీరు అవసరం.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *