త్రాటకము

త్రాటకము అనగా ఏకాగ్రత . దీపము గాని, ఉదయించు సూర్యడు, చంద్రుల వేపు గాని ద్రుష్టి నిలుపుట. త్రాటకము వలన ఏకాగ్రత పెరుగును.

అన్ని శాస్త్రముల యొక్క ముఖ్య ఉద్దేశ్యము మానసిక, శారీరక, సాంఘీక పురోభివృద్ధియే!
ఆనందము పొందుటకు మన పూర్వీకులు ఆసన , ప్రాణాయామ క్రియలు యోగము ద్వారా మనకు అందించినారు. యోగాభ్యాసం ద్వారా మన శరీరములోని పంచభూతశక్తి పూర్తిగా వినియోగింపబడును.

భూమి
జలము
అగ్ని
వాయువు
ఆకాశము

యోగాభ్యాసములో పంచభూతశక్తి ఏకీకరణతో మరియు సమతుల్యలతో లబించుచున్నది. మనము నివశించు స్థలములోని కుండలినీ శక్తిని గ్రహించుము. మనసును ఏకాగ్రత సాధించడం కోసం త్రాటక క్రియ ఉపయోగపడును.

స్వామీ గోరక్షనాథ్ శిష్యుడు శ్రీ స్వాత్వారామ యోగీంద్రులు సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన గ్రంథముగా చెప్పబడుతున్నది. ఈ గ్రంథము 11వ శతాబ్దములో వ్రాయబడినది. ఈ గ్రంథములో
శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు కలవు.

{ధౌతి ర్వస్తి స్తథా నేతి స్త్రాటకం నౌలికం తథా
కపాలభాతి శ్చేతాని షట్కర్మాణి ప్రచక్ష తే}
(హఠయోగ ప్రదీపిక 2.22)

1)ధౌతి, 2)బస్తి, 3)నేతి, 4)త్రాటకము, 5)నౌలి, 6)కపాలభాతి అను ఈ ఆరు షట్ క్రియలు అనబడుచున్నవి.

త్రాటకము చేయు విధానం:

వజ్రాసనంలో కూర్చొని వెన్నెముక, తల నిటారుగా ఉంచి, రెండు అడుగుల దూరంలో దీపం వెలిగించి వుంచవలెను.
శరీరం కదలకుండా కూర్చోవాలి.
నిదానంగా దీపం వెలుగును రెప్పవేయకుండా , కనుగ్రుడ్డు కదలకుండా చూడవలెను. ఈ విధంగా 5 నుంచి 10 నిమిషాలు చేసిన తర్వాత కళ్ళు మూసుకొని వెలుగును భావించవలెను.
ఈవిధముగ కొద్ది సేపు చేసిన తర్వాత కళ్ళు తెరవలెను. ఈ విధంగా త్రాటకము చేయాలి.

త్రాటకము ప్రయోజనాలు:

కళ్లు ప్రశాంతంగా, కాంతివంతమగును. నరముల ఒత్తిడిని, ఆందోళనను తొలగించును. జ్ఞాపకశక్తిని పెంచును. ఏకాగ్రత పెరుగును. సంకల్పశక్తి దృఢమగును. ధారణకు, ధ్యానమునకు సహకరిస్తుంది.

జాగ్రత్తలు:

కళ్ళపై ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. గాలి వేయనిచోట చేయవలెను. కాలవ్యవధి నెమ్మదిగా పెంచవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *