ధనురాసనము

వయసు ఛాయలు కనిపించకుండా ఉంచే ధనురాసనము.

వయసు పెరిగే కొద్దీ ఆ మార్పులు శరీరంలో కనపడకుండా ఉండటానికి చాలా రకాల సౌందర్య లేపనాలు వాడుతుంటారు. అయితే వాటితో ఒరిగే ప్రయోజనం శూన్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరం అంతర్భాగంలో కణాల్లో జరిగే మార్పులపై ఈ క్రీములు ఎలాంటి ప్రభావం చూపవని పేర్కొంటున్నారు.

ఈ చర్యలన్నీ శరీరం అంతర్భాగంలోని కణాలస్థాయిలో జరగుతుంది. యోగా ద్వారా వయసు ఛాయలు ఆలస్యంగా కనబడతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు.శరీరంలో కణాలకు అవసరమైన ప్రొటీన్లను రైబోజోమ్స్ ఉత్పత్తి చేస్తాయని, యోగా చేయడం ద్వారా వీటి ప్రక్రియ నెమ్మదిస్తుంది.

యోగా చేయడం ద్వారా వయసు పైబడిన చాయలు తగ్గడమే కాకుండా, ఆయుర్దాయుం కూడా పెరిగినట్లు పరిశోధనలో తేలింది. ధనురాసనము ద్వారా వయసు ఛాయలు కనిపించకుండా చేసుకోవచ్చు.

ధనురాసనము:

ధనుస్ అంటే సంస్కృతంలో విల్లు. శరీరాన్ని విల్లులా వంచి చేసే ఆసనం ధనురాసనం. ఈ ఆసనం ధనుస్సును పోలి ఉండటం వల్ల దీనికి ధనురాసనమని పేరువచ్చింది.

ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని వెనుకకు వంచి పాదాలను చేతుల్తో పట్టుకుని ఈ ఆసనాన్ని చేయాలి.

A)బోర్లా పడుకొని సమ స్థితిలో ఉండాలి, గడ్డం నేలపై ఆనించి భుజాలను నేలపై ఉండేలా చూసి, కండరాలను వదులుగా ఉండేలా చూసుకోవాలి. గాలి సాధారణంగా పీల్చుకోవాలి.

B) కాళ్ళను మెాకాళ్ల వద్ద మెల్లిగా వెనుకకు వంచాలి. పాదాలను కొంచం ఎడంగా ఉంచాలి.

C)రెండు కాళ్ళ చీలమండలాలను రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి. చేతులతో గట్టిగా పట్టుకోవాలి. తల, మెడను మెల్లగా వెనుకకు వంచాలి.D) కొద్దిగా శ్వాస పీల్చి తలను,ఛాతీభాగాన్ని, తొడలు, కాళ్ళను పైకి ఎత్తాలి. కాళ్ళను వెనుకకు తన్నిపెడుతూ పొట్ట మాత్రం నేలమీద ఉంచాలి. శరీరం బరువు అంతా పొత్తికడుపుపై ఉండాలి.
దీర్ఘంగా గాలి పీల్చుకోవాలి. పూర్తిగా గాలి వదలాలి.
ఉండగలిగినంతమేర ఉండి శ్వాసను వదలివేస్తూ పూర్వపుస్థితికి రావాలి.
తరువాత బోర్లా పడుకొని. కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలి.

ధనురాసనము ఉపయోగం:

వయసు ఛాయలు కనిపించకుండా ఉంచుతుంది, వెన్నుముక, సర్వాయికల్‌స్పాండిలాయిటీస్, నడుము సమస్యలు తొలగును. గ్యాస్ట్రిక్, మలబద్ధకం, అజీర్తి వంటి ఉదర సంబంధ వ్యాధులు తొలగును.
ఋతుక్రమం సక్రమమగును.
గర్భాశయమునకు లాభదాయకమగును.
మూత్రపిండాల సమస్యలు, మూత్ర సమస్యలు తొలగును.
నాభిస్థానంలో ఉన్న 72 వేల నాడులు చైతన్యమగును. లైంగికశక్తి వృద్ధియగును.
శరీరంలోని ప్రతి కీలు, కండరాలను సాగదీయబడి కీళ్ళనొప్పులు తొలగును.
కాళ్ళకు, చేతులకు బలమునిస్తుంది.ధనురాసనము జాగ్రత్తలు

హెర్నియా, పెద్దప్రేవు సమస్యలు, పొట్ట అల్సర్లు, గుండె జబ్బు, రక్తపోటు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయడం అంత మంచిది కాదు. ఉదర సంబంధిత శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు పూర్తిగా నయమయ్యేంత వరకూ ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *