పాద హస్తాసనం

పాద హస్తాసనం యోగాసనాలలో ఒక ఆసనం. ఈ ఆసనం లో చేతులతో పాదములను అందుకోవడం వలన దీనికి పాదహస్తాసనం అని పిలుస్తారు.

పాద హస్తాసనం చేయు విధానం:

A) మొదటగా చదునైన నెలపై నిటారుగా నిలబడాలి. ఈ స్థితిలో కాళ్ళు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండాలి.

B)మెల్లగా చేతులను నిటారుగా పైకి తీసుకురావాలి.

C)శరీరంను మెల్లగా పైకి సాగదీసి కటి(hip) భాగము నుండి ముందుకు వంచాలి. ఈ స్థితి లో శరీరము 90° కోణములో కనిపించును.

D)శ్వాస వదులుతూ ముందుకి వంగి చేతులతో పాదాలను మెల్లగా చేతులను పాదాలకిరువైపులా ఉంచాలి. తలను మోకాలికి ఆనించాలి.
ఇలా కొద్ది క్షణాలు ఉన్న తరువాత మెల్లగా యధా స్థితికి రావాలి.ఉపయోగాలు:

ఉదర భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును. ఆసనం భాగంలోని గ్రంధులను ఉతేజపరుచును. అజీర్ణము , మూలశంఖ, ఉదర వాయువుల సమస్యలను తగ్గించును. వెన్నుముఖకు శక్తినిచ్చును.రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును.వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును. వెన్నుముఖకు శక్తినిచ్చును.రక్త ప్రసరణ ను వృద్ధి చెయ్యును. వీపు, నడుము కండరాలకు శక్తినిచ్చును.

జాగ్రత్తలు:
నడుము నొప్పి ఉన్నవారు చేయరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *