భుజంగాసనం

సంస్కృతంలో భుజంగ అంటే పాము అని ఆసన అంటే భంగిమ అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన భంగిమగా చెప్పవచ్చు.

A)భుజంగాసనం వేయు విధానం: మకరాసనంలో విశ్రాంతిగా ఉండండి. కాలిమడమలను బొటనవేళ్లను కలిపి ఉంచి బోర్లా పడుకోవాలి.

B)చుబుకాన్ని నేలకు ఆనించాలి. అరికాళ్లు పై వైపుకు తిరిగి ఉండాలి. మోచేతులను వంచి అరచేతులను ఆఖరి పక్కటెముక ప్రక్కగా ఉంచండి. మోచేతులను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలాన్ని ఉంచొద్దు.

C)ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి. నాభిస్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి. ఈ భంగిమను చేసిన తరువాత, గాలిని పీల్చండి, వదలండి. తిరిగి మెల్లగా మకరాసనంలోకి రండి.భుజంగాసన వలన కలిగే ప్రయోజనాలు:

భుజంగాసనం చాలా శక్తివంతమైన భంగిమగా పేర్కొనవచ్చు, ఈ ఆసనాన్ని అనుసరించటం వలన వెన్నుముకలో కలిగే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. వెన్నుముక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొనే వారు దీనిని అనుసరించటం వలన నొప్పుల నుండి మరియు వెన్నెముక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.
వెన్నెముకకు బలాన్ని చేసూరుస్తుంది.

భుజంగాసన వలన భౌతిక పరంగానే కాకుండా, అంతర్గత శరీర అవయవాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా, జీర్ణాశయ సమస్యలతో భాదపడే వారికి ఈ ఆసనం చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వలన అంతర్గత అవయవాలను ఉత్తేజానికి గురి చేసి, జీర్ణక్రియ సజావుగా జరిగేలా చూస్తుంది.
ఈ ఆసనాన్ని అనుసరించటం వలన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా తగ్గిపోతుంది.

భుజంగాసనంను రోజు అనుసరించటం వలన, అలసట, తలనొప్పి మరియు బలహీనత వంటి వివిధ రకాల సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వీటితో పాటుగా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను కూడా ఈ ఆసనం ద్వారా తగ్గించుకోవచ్చు.

శక్తివంతంగా మరియు చైతన్యవంతంగా ఉండటానికి, మెరుగైన రక్తప్రసరణ అవసరం. భుజంగాసన వలన ఆక్సిజన్ సరఫరా అధికంగా జరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వలన హార్మోన్లు కూడా సరైన స్థాయిలో విడుదల అవుతాయి.

జాగ్రత్తలు:

తీవ్రమైన వెన్నునొప్పిని కలిగి ఉంటె చేయకూడదు. ఆసనాన్ని అనుసరించే ముందు అవగాహన తీసుకొని అనుసరించటం చాలా మంచిది.విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *