భ్రామరి ప్రాణాయామము

మానసిక ఒత్తిడిని తోలగించే భ్రామరి ప్రాణాయామము:

మనలో భావోద్వేగాలు, అనుభూతులు, కోరికలు కలిగించేది మనస్సు. ఏదైనా వస్తువు లేదా జీవరాశిపై ప్రేమ లేదా ద్వేషం కలిగించే ఒక అంతరాళం మనస్సు. ప్రతి మనిషి యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం.. పోటీతత్వంతో పాటే మానసిక ఆందోళనలు, ఒతిళ్లూ పెరుగుతున్నాయి.. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న యాంత్రిక జీవనం మనషులకు మనసిక ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఉరుకులు పరుగుల జీవనం.. గజిబిజి బతుకులు అన్ని రంగాలకూ పాకిపోవడంతో మనోవ్యథ అధికమైపోయింది. ఇంట్లో.. ఆఫీసుల్లో పనిభారంతో మహిళలు.. ర్యాంకులకోసం పుస్తకాలతో కుస్తీ పడుతూ విద్యార్థులు… ఉద్యోగాల వేటలో నిరుద్యోగులు.. బాస్‌ల టార్చర్, నిద్రలేమితో సాఫ్ట్‌వేర్, ప్రైవేట్ ఉద్యోగులు.. పరిణితిలేని ఆలోచనలతో యువత.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. యోగా, వ్యాయామానికి రోజుగంట కేటాయిస్తే మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక దృఢత్వం లభిస్తుంది. మనం చేసే పనిని భారంగా కాకుండా పాజిటివ్ దృక్కోణంతో చేస్తే సంతృప్తి.. సంతోషం కలుగుతుంది.స్వామీ గోరక్షనాథ్ శిష్యుడు శ్రీ స్వాత్వారామ యోగీంద్రులు సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన గ్రంథముగా చెప్పబడుతున్నది. ఈ గ్రంథము 11వ శతాబ్దములో వ్రాయబడినది. ఈ గ్రంథములో అష్టకుంభకా ప్రాణాయామములను వివరించారు.

1) సూర్య భేద ప్రాణాయామము
2) ఉజ్జాయి ప్రాణాయామము
3) సీత్కారి ప్రాణాయామము
4) శీతలి ప్రాణాయామము
5) భస్త్రిక ప్రాణాయామము
6) భ్రామరి ప్రాణాయామము
7) మూర్చ ప్రాణాయామము
8) ప్లావనీ ప్రాణాయామముభ్రామరి ప్రాణాయామము:

భ్రామరి అనగా తుమ్మెద. భ్రామరీ ప్రాణాయామమును చేయునపుడు తుమ్మెద నాదము వంటి శబ్ధము వచ్చుట చేత ఈ విధమగు ప్రాణాయామమును భ్రామరి అనిరి. అష్టకుంభకా ప్రాణాయామములలో భ్రామరి ఒకటి.

భ్రామరి చేయువిధానము:

చేతివేళ్ళను ఉపయోగించి రెండు చెవి రంధ్రాలను, కాళ్ళను మూసుకొని ఉండలి.
ముక్కు యొక్క రెండు ముక్కు రంధ్రములతోను శబ్ధముతో కూడిన పూరకము చేసి కుంభించి తిరిగి రెండు ముక్కు రంధ్రములతోను తుమ్మెద ఝుంకారము వచ్చులాగ గాలిని రేచించుచు చేయునది భ్రమరిక ప్రాణాయామము అందురు. ఈవిధముగ మార్చి మార్చి 20 to 30 సార్లు చేయవలెను.

ఫలితములు:

సుశబ్దముచే చిత్తము రంజిల్లును. శరీరము వేడెక్కుచు చల్లబడుట వలన సుఖముగా నుండును. మానసిక స్థెర్యాన్ని పెంపొందించే భ్రామరి ప్రాణాయామము ద్వారా ఆత్మవిశ్వాసం.. ఏకాగ్రత పెరిగి ఒత్తిడి దూరమై విజయం మీ సొంతమవుతుంది.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *