మత్స్యాసనం

సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం. ఈ ఆసనస్థితిలో శరీరం చేపను పోలి ఉండటం వల్ల దీనికి మత్స్యాసనమని పేరు వచ్చింది.

మత్స్యాసనం చేయువిధానము :

A) నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి.

B) తర్వాత చేతితో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ విధంగా పద్మాసన స్థితిలోకి రావాలి.

C) మోకాలు భాగాలు తప్పనిసరిగా నేలను తాకుతున్న స్థితిలో ఉండాలి మోచేతులను వెనుకకు తీసుకురావాలి. మీ వీపును నేలకు సమాంతరంగా ఉంచాలి. ఈ స్థితిలో మీ మోచేతులు మరియు చేతుల సాయాన్ని మీరు తీసుకోవచ్చు. మీ చేతులను తలవైపుగా వెనక్కు ఉంచాలి. ఇప్పుడు మీ అరచేతులు నేలకు సమాంతరంగా ఉంచాలి. మీ చేతులు భుజాలకు వ్యతిరేక దశలో ఉండాలి. మీ అరచేతులను, మోచేతులను కిందికి నొక్కి ఉంచాలి. మీ పొత్తి కడుపును, ఛాతీని ముందుకు లేపి ఉంచాలి. నడుము, వీపు, భుజాలు నేలకు తాకకుండా పైకి లేపాలి. మీ శరీరం ఇప్పుడు మీ చేతుల సాయంపై ఆధారపడి ఉండాలి.D) వెన్నుపూసను విల్లులాగా వంచాలి. అదే సమయంలో మీ మెడ మరియు తలను గరిష్ఠ స్థాయిలో వెనుకకు వంచాలి. మీ తల పైభాగం నేలకు తాకేలా ఉండాలి.
మీ చేతులను ముందుకు చాచండి. మడిమలు వెనుక భాగాలను పట్టి ఉంచండి. మీ పొత్తికడుపు మరియు రొమ్ముభాగాన్ని పైకి ఎత్తి ఉంచేందుకు మీ మోచేతులు ఒక కప్పీలాగా ఉపయోగపడాలి. ఇది మీ వెన్నుపూసను వంచేందుకు మరియు మీ తలపైభాగం నేలమీద సరైన స్థితిలో ఉంచేలా తోడ్పడుతుంది. బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలు మూడూ ఎదురుగా ఉన్న కాలివేళ్ళను గట్టిగా పట్టి ఉంచడానికి గాను కొక్కీ రూపంలో ఉండాలి. ఇదియే మత్స్యాసనం.
ఈ స్థితిలో ఉండి, మీరు మామూలుగానూ, క్రమబద్ధంగాను శ్వాసను పీలుస్తుండాలి. ఈ స్థితినుంచి మెల్లగా ప్రారంభంలోని పద్మాసన స్థితికి మళ్లాలి, తర్వాత శవాసనంలో పడుకొని విశ్రాంతి తీసుకోవాలి.మత్స్యాసనం ప్రయోజనాలు :

ఛాతీ పరిమాణం పెరుగుతుంది. మీ ఊపిరితిత్తులు తాజా ప్రాణవాయువును పీల్చు ఉంచుకునేలా తమ సామర్థ్యతను పెంచుకుంటాయి. వెన్నెముక బలిష్టంగా తయారవుతుంది. వెన్ను మరియు మెడ ప్రాంతాలు విస్తరించడం వల్ల మరింత అనుకూల స్థితిలో ఉంటాయి. వెన్ను వంపు భాగాలు సరిదిద్దబడతాయి.
థైరాయిడ్, సర్వాయికల్ సమస్య, ఊపిరితిత్తుల సమస్యలు తొలగును.
తుంటి భాగాలకు, గర్భాశయమునకు లాభదాయకం. ముఖము కాంతివంతమగును. ఋతుక్రమం సక్రమమగును. గుండె బలోపేతమగును, రక్తప్రసరణ సక్రమమగును.

జాగ్రత్తలు:
ఛాతీలో, మెడలో నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ ఆసనం వేయరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *