మీరు సరిగా నిద్ర పోవటం లేదా ?

బిజి బిజి జీవన శైలి లో మనం సరిగా నిద్ర పోము అర్ధ రాత్రి పార్టీ లని, టీవీ షో లని, సినిమా లని, ఆఫీస్ లో డెడ్ లైన్స్ అని సరిగా నిద్ర పోము .
నిజానికి నిద్ర అనేది చాల ముఖ్యమైనది ఎంత శ్రమిస్తామో అంతే విశ్రాంతి నిద్ర రూపంలో అవసరం.

మీరు ఐదు రోజుల నుంచి ఆరు రోజుల వరకు ఉద్యోగం చేసే వారు అయితే ఖచ్చితంగా ఆరు నుంచి ఏడు గంటల వరకు నిద్ర అవసరం.



సరైన నిద్ర పోవటం కోసం ఈ చిట్కాలు పాటించండి :

*ఆఫీస్/పని/దుకాణం/ఇతర  నుంచి రాగానే గోరు వెచ్చటి నీటితో సాన్నం చేయాలి.
*వీలైనంత త్వరగా నిద్ర పోవటానికి ప్రయత్నించాలి.
*భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాసేపు కూర్చొని తర్వాత నడిచి(వాకింగ్) పడుకోవాలి,యోగ చేసే అలవాటు ఉన్న వారు వజ్రాసనం 15 నిముషాలు కూర్చుంటే చక్కని నిద్రకు తొడపడుతుంది.
*గోరు వెచ్చని పాలు త్రాగటం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.



*టీవీ,మొబైల్ మరియు కంప్యూటర్ రాత్రి పూట వాడటం తగ్గించాలి ఇందులో ఉండే బ్లూ లైట్ నిద్ర రాకుండా చేస్తేయి.
*భోజనం కూడా మితంగా చేయాలి, ఆకలిగా అనిపిస్తే పాలు తాగటం మంచిది.
*కుదిరితే స్విమ్మింగ్ చేయండి ,స్విమ్మింగ్ వల్ల నిద్ర లేమి పోతుంది.
*వ్యాయామం చేయడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
* చదవటం వల్ల నిద్ర బాగాపడుతుంది కానీ అది పుస్తకం అయి ఉండాలి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *