శీర్షాసనం

శీర్షం అనగా తల. ఈ ఆసనంలో శరీరం తలపై నిలబడి ఉండుట వలన దీనిని శీర్షాసనం అని అంటారు.

శీర్షాసనం చేయు విధానం:

A)వజ్రాసనంలో కూర్చోవాలి.

B) శరీరం ముందుకు తీసుకువస్తూ రెండు చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించాలి. చేతుల సహాయంతో తలను చేతుల దగ్గర ఉంచాలి.

C)మోకాళ్ళను పైకి తీసుకురావాలి.

D)ముందుగా ఒకకాలును పైకి తీసుకొని రెండో పాదం నేల మీద ఉంచాలి. శక్తినంతటిని మోచేతులు తలమీదకు తెస్తూ రెండువ కాలును పైకి తీసుకురండి.

E)రెండు కాళ్ళను వెనుకకు వంచి శరీరం కదలకుండా ఉంచాలి.F)రెండు కాళ్ళను నిటారుగా ఉంచాలి. శరీరం బరువును చేతులు, తల ఆనించి శరీరాన్ని దృఢంగా ఉంచాలి. ఇదియే శీర్షాసనం. ఈ స్థితిలో స్థిరంగా ఉండగలిగినంతసేపు ఉండి, క్రమంగా వెళ్లిన విధానంలోనే వెనుకకు రావలెను. తరువాత శవాసనంలో పడుకొని విశ్రాంతి తీసుకోవాలి.ఉపయోగం:

వయస్సును పెరగకుండా చేయును, మనోనేత్రం శుద్ధి అయ్యి, మృత్యుంజయుడు అగును. షడ్‌చక్రాలు ఉత్తేజితమవుతాయి. యోగసాధనకు చాలా విలువైన ఆసనం, ముఖ వర్చస్సు కాంతివంతమగును. యోగ ద్వారా మోక్షప్రాప్తి పొందడానికి ఉపయోగపడే ఆసనం. థైరాయిడ్ సమస్య తొలగును. జరామరణ చక్రముల నుండి విముక్తి కలుగును, లైంగికశక్తి వృద్ధి అగును.

చేయకూడనివారు:

మెదడు సంబంధిత వ్యాధులు, జలుబు చేసినవారు, చెవి సంబంధిత వ్యాధులున్నవారు, గుండె వ్యాధులు, బి.పి ఉన్నవారు చేయరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *