సూర్య నమస్కారం

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.
ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఐదు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది.

సూర్య నమస్కార ఆసనాలు చేయు విధానం:

0,12)పణామాసనం: సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

1,11)హస్త ఉత్థానాసనం: కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

2,10)పాదహస్తాసనం :
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

3,9)అశ్వసంచలనాసనం :
కుడి మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

4,8)పర్వతాసనం :
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి చేయాలి.

5)శశాంకాసనం :
మోకాళ్ల వద్ద కాళ్లను వంచి కాలివేళ్లు, మడమల ఆధారంగా కూర్చొనండి.
శ్వాసను తీసుకుంటూ ముందుకు రావాలి. చేతులను నేలకు ఆనించాలి. శిరస్సును నేలకు ఆనిస్తూ, ముక్కును మోకాళ్ళ మధ్యకు తీసుకురావాలి.6)అష్టాంగాసనం:
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంఅష్టాంగాసనం ‘ అని అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7)భుజంగాసనం :
ముందుగా తలను పైకెత్తుతూ త్రాచుపాము పడగెత్తినట్లు శరీరాన్ని నెమ్మదిగా పైకెత్తండి. నాభిస్థానము నేలకు అంటీ అంటనట్లుగా ఉంచండి. ఈ భంగిమలో గాలిని పీల్చండి.

ఉపయోగాలు:

సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. శ్వాస పై ధ్యాస, వేదాత్మక ప్రార్థనలు వంటి వాటితో ఈ ప్రక్రియలను జోడించాలి. శరీరంలో ఉండే ప్రతి అవయవంలోని విష పదార్థాలను సహజ సిద్ధంగా తొలగించగల ప్రక్రియలివి.
శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి. వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు… మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తోంది. సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు… సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.జాగ్రత్తలు:

జ్వరం, అల్సర్లు, గుండె, రక్తప్రసరణ సంబంధించిన సమస్యలు ఉన్నవారు, బ్యాక్‌పెయిన్ ఉన్నవారు చేయరాదు.

సూర్యుని నామాలు:

1 ఓం హ్రాం మిత్రాయ నమ:
2 ఓం హ్రీం రవయే నమః
3 ఓం హృం సూర్యాయ నమః
4 ఓం హ్రైం భానవే నమః
5 ఓం హ్రౌం ఖగాయ నమః
6 ఓం హ్రా: పూష్ణే నమః
7 ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః
8 ఓం హ్రీం మరీచయే నమః
9 ఓం హృం ఆదిత్యాయ నమః
10 ఓం హ్రైం సవిత్రే నమః
11 ఓం హ్రౌం అర్కాయ నమః
12 ఓం హ్రా: భాస్కరాయ నమః


By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasivaLeave a Reply

Your email address will not be published. Required fields are marked *