యోగ ఆసనాలు ఏ సమయంలో చేయాలి ?-What is the best time for Yoga Asanas

ఈ మధ్య అందరికి యోగ అంటే ఏంటో తెలుసు కానీ ఏ సమయం లో యోగ చేయాలి, వ్యాయామం చేసి యోగ చేయొచ్చా లేక యోగ చేసి వ్యాయామ ? అని పలురకాల అనుమానాలు ఉండొచ్చు.

యోగ ఎప్పుడు చేయాలో తెలుసుకోండి :*భోజనం చేసిన వెంటనే యోగ ఆసనాలు వెయ్యకూడదు, భోజనం చేసిన 4 గంటల తర్వాత యోగ చేయాలి ఒకవేళ తక్కువగ భోజనం చేస్తే 2 గంటల తర్వాత చేయాలి.
” వజ్రాసనం ఎప్పుడైనా చేసుకోవొచ్చు”
*వ్యాయామం చేసాక కొద్దీ సమయం శవాసనం చేసి ఆ తర్వాత యోగ ఆసనాలు చేయాలి.
*యోగ ఆసనాలు స్నానం తర్వాత లేదా స్నానం ముందు, అరగంట సమయం ఉండేలా చూసుకొని చేయాలి.
*మీరు ఎంతవరకు చేయగలరో అంతే చేయండి ,చేతకానిది చేసి బాధ పడకండి.
*రోజు చేస్తేనే యోగ వల్ల కలిగే ప్రయోజనలు కనపడతాయి.*పీరియడ్స్ లో ఉన్న స్త్రీలు యోగ ఆసనాలు చేయకూడదు,గర్భం దాల్చిన 5 నెలల తర్వాత యోగ ఆపివేయాలి.
ప్రసవం అయినా మూడు నెలల తర్వాత మళ్ళీ యోగ చేయొచ్చు.(నిపుణలు అడిగి చేయటం మంచిది).
*యోగ చేసిన తర్వాత మీకు ఇబ్బంది అనిపిస్తే ,ఏదో తప్పు చేస్తున్నారు అని తెలుసుకోండి. వీలైన తొందరగా నిపుణలని అడిగి తెలుసుకోండి.