కటి చక్రాసనం-వెన్నెముక సమస్యలకు ఉపశమనం

యోగతో వెన్నెముక సమస్యలకు ఉపశమనం

నిశ్చలమైన జీవనశైలిని అనుసరించేవారు ఎక్కువగా వీపు నొప్పితో భాదపడుతుంటారు.

యోగ నొప్పులను ఉపశమన పరుచుటలో శక్తివంతంగా పనిచేస్తుంది.  మరియు వీపులో కలిగే నొప్పులను దూరం చేస్తుంది.

వెన్నెముక

మనుషుల వెన్నెముకలో 33 వెన్నుపూసలు(Vertebrae)

శరీరం వెనకభాగంలో మెడనుండిపిరుదుల వరకు ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి.

గ్రీవ కశేరుకాలు (Cervical vertebra) – 7

వక్షీయ కశేరుకాలు(Thoracic vertebra)-12

*కటి కశేరుకాలు (Lumbar vertebra) – 5*

త్రికము (Sacrum) – 5

అనుత్రికము (Coccyx) – 4

వెన్నెముక దృఢంగా తయారవడానికి యోగ  ఆసనాలు వేయాలి.

కటి చక్రాసనం:

కటి అంటే నడుము. కటిని తిప్పే ఈ ఆసనాన్ని కటి చక్రాసనం అంటారు. దీని వలన శరీరానికి,వెన్నెముకచాలా మేలు జరుగుతుంది.

ఆసనం వేయు పద్దతి:

A)చదునైన నేలపై నిటారుగా నిలబడాలి.తల వెనుకభాగం సమాంతరంగా ఉండేలా చూడాలి.చూపు ఎదురుగా ఉండాలి.చేతులను ముందుకు చాపాలి.అలాగే కాళ్ళ మధ్య కనీసం అరమీటరు దూరం ఉండేలా చూడాలి.

B) ఎడమ చేతిని కుడి భుజంపైకి తీసుకురావాలి. కుడిభుజాన్ని వెనుకకు మడవాలి. కుడి భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి.

C) అలాగే కుడిచేతిని ఎడమ భుజంపైకి తీసుకువస్తూ ఎడమ భుజాన్ని వెనుకకు మడవాలి. ఎడమ భుజంపై నుంచి వీలైనంత వరకు చూడాలి. ఈ స్థితిలో కొన్ని సెకనులు నిలబడాలి. ఇలాగే కొద్దసేపు నిలబడిన తరువాత పూర్వస్థితికి రావాలి. ఇలా కనీసం 10 మార్లు చేయాలి.ప్రయోజనాలు:

పొట్టలోని భాగలకు, ప్రేగులకు వ్యాయామము జరిగి వాటిలోని  లోపములను తొలగిస్తుంది. ఛాతీభాగాన్ని, భుజములకు బలమునిస్తుంది.

వెన్నెముకను, ప్రక్కటెముకలను దృఢంగా చేస్తుంది. పొట్టలోని క్రొవ్వును కరిగిస్తుంది.

వెన్నెముక సమస్యలను తొలగిస్తుంది.

జాగ్రత్తలు:

భుజం నొప్పి ఉన్నవారు ఈ ఆసనాన్ని వేయకపోవడం మంచిది.

 అవసరమైనంత విశ్రాంతి తీసుకోండి.

ఎక్కువ సమయం మీ వెన్ను భాగాన్ని కదలకుండా ఉంచకండి దీని వలన నొప్పి మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సమయం కదలకుండా ఉండటం వలన వెన్నుపూస బిగుతుగా మారి, నొప్పి అధికం అవుతుంది. కొన్ని నిమిషాల ఒత్తిడి తరువాత, మీ చేతులను మరియు కాళ్ళను త్రిప్పడం వలన కండరాలలో ఒత్తిడి తగ్గి కొంచెం ఉపశమనం కలుగుతుంది.

ఆహారాన్ని మార్చండి

వారంలో ఒక రోజు కూరగాయలను, తాజా పండ్ల రసాలను తాగండి. ఇవి మీ శరీరంలోని వెన్నుపూసలలో కలిగే వాపులను తగ్గిస్తుంది.

ఆర్థ్రైటీస్ వలన భాదపడేవారు త్వరగా కొలుకొటానికి తినే ఆహారంలో అల్లం, తేనె,  వంటి వాటిని కలుపుకోవాలి. ఎక్కువ యాంటీ-ఆక్సిడెంట్స్’ని అందించే, గ్రీన్-టీ, వలన నొప్పి నుండి త్వరగా కోలుకుంటారు.మసాజ్

వెన్నుపూస పై నొప్పికి మసాజ్ ఒక ప్రక్రియ, మీరు నొప్పిగా భావించే ప్రదేశంలో మసాజ్ చేయటం వలన అక్కడ ఉండే కణాలు ఒత్తిడికి గురి అయ్యి, కండరాలలో కదలికలు ఏర్పడి, బిగుతుగా ఉండే మీ వెన్ను భాగము ఉపశమనం పొంది, నొప్పులు తగ్గిపోతాయి. మసాజ్ చేయటం వలన నొప్పిగా అనిపించిన ప్రాంతాలలో రక్తప్రసరణ సరిగా జరిగి, నొప్పి తగ్గిపోతుంది. వేడి నీటితో స్నానం చేయటం వలన కండరాలు ఉద్దీపనకి గురైయి, వెన్ను నొప్పిని తోలగిస్తాయి.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva