కపాలభాతి

కపాలభాతి క్రియతో మెరుపులాంటి అందం:

స్వామీ గోరక్షనాథ్ శిష్యుడు శ్రీ స్వాత్వారామ యోగీంద్రులు సంస్కృతములో రచించిన హఠయోగ ప్రదీపిక, హఠయోగములో ప్రాచీన గ్రంథముగా చెప్పబడుతున్నది. ఈ గ్రంథము 11వ శతాబ్దములో వ్రాయబడినది. ఈ గ్రంథములో
శరీరమును శుద్ధి పరచు ఆరు పద్ధతులు కలవు.

{ధౌతి ర్వస్తి స్తథా నేతి స్త్రాటకం నౌలికం తథా
కపాలభాతి శ్చేతాని షట్కర్మాణి ప్రచక్ష తే}
(హఠయోగ ప్రదీపిక 2.22)

1)ధౌతి, 2)బస్తి, 3)నేతి, 4)త్రాటకము, 5)నౌలి, 6)కపాలభాతి అను ఈ ఆరు షట్ క్రియలు అనబడుచున్నవి.

కపాలభాతి: సంస్కృతంలో కపాల అనగా శిరస్సు, భాతి అనగా ప్రకాశింపజేయునది.

కపాలభాతి చేయు విధానం:

A) ఈ కపాలభాతి ప్రారంభించటానికి మీరు వజ్రాసనం లేదా సుఖాసనంలో కూర్చొవాలి. ఉదరాన్ని సాధ్యమైనంత వరకు సౌకర్యవంతంగా ఉంచాలి.
మోకాళ్ళ మీద అరచేతులను ఉంచాలి.B) అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచి,
రెండు చేతులను పిడికిలిగా తయారుచేసి తొడల మీద ఉంచాలి. పిడికిలి మాత్రమే బిగించి ఉంచాలి. శరీరం, ముఖములో ఎటువంటి బిగింపులు ఉండకూడదు.

ఇప్పుడు రెండు ముక్కు రంద్రాల ద్వారా యాదృచ్చికంగా తీసుకున్న శ్వాసను బయటకి వదలివేస్తూ చేయాలి. లోతైన శ్వాసను తీసుకోవాలి. గాలిని పీల్చటం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. అందువల్ల గాలిని వదిలే క్రమం మీద దృష్టిని కేంద్రీకరించాలి. బలమైన, వేగమైన ఉచ్ఛ్వాసములు చేయాలి. ఊపిరిని బిగ పట్టరాదు.

మొదట 60 నుంచి 80 శ్వాసలతో ప్రారంభించాలి. ఆ తర్వాత 90 నుంచి 120 వరకు నిదానంగా పెంచుకుంటూ . ఊపిరి అడనట్టు అన్పిస్తే, ఆపి సాదారణ శ్వాస తీసుకోని మరల ప్రారంభించవచ్చు.
ప్రతి రోజు 15 నుంచి 20 నిమిషాల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.ఉపయోగం:
కపాలభాతి వలన శిరస్సు లోని భాగములు శుభ్రమగును. కంటికి, చెవులకు, ముక్కునకు, మెదడుకు ఛాల మంఛిది.
ఈ క్రియ వలన చాల శారీరక మానసిక లాభములు ఉన్నాయి. మైగ్రేన్ తలనొప్పి, వెన్నెముక నొప్పి నివారించబడతాయి. జీర్ణవ్యవస్ధకు సంబంధించిన గ్యాస్ట్రిక్, అజీర్తి, అల్సర్, మలబద్ధకం తొలగించవచ్చు. పొత్తికడుపులో ఉన్న క్రొవ్వు పదార్ధం కరిగిపోయి పొట్ట తగ్గుతుంది. స్ర్తీలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఋతుక్రమము సక్రమమగును. గర్భాశయము బలోపేతమగును.
ఈ క్రియ రక్తములోని బొగ్గు పులుసు వాయువుని తొలగించును. మొదడు లోని కణములను ఉత్తేజ పరచును.
కపాలభాతి క్రియతో మెరుపులాంటి అందం వస్తుంది. వాయుద్వారములను శుద్ధి పరచును. ఉదరావయములను చైతన్యపరచును. శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది.
ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి. సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి. కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది.

గమనిక:
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గర్భిణిలు, ఋతుక్రమములో ఉన్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు, ఆపరేషన్ జరిగి సంవత్సరంలోపు ఉన్నవారు చేయరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva