పవనముక్తాసనం-ఉదరకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు

యోగ ద్వారా ఉదరకోశ సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఉదరకోశ సమస్యలు:

పేగుల్లో తయారయ్యే గ్యాస్ మహా ఇబ్బందిని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తుంది. ఇది బయటకు రావటానికి ప్రయత్నించటంతోనే త్రేన్పులు వస్తుంటాయి. మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపాన వాయువు అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది.
ప్రేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి.

ఆహార ,విహారాదుల్లో నియమం తప్పకుండా వుంటే ఆరోగ్యం గా ఉంటాం . ఈ కాలం లో అంతా బిజీబిజి తిండి తినడనికి తగిన సమయం ఉండడం లేదు.
గ్యాస్ సమస్య కలిగినవారికి కడుపునొప్పిగా అనిపిస్తుంది. రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే.

కారణాలు

మాట్లాడేటప్పుడు ఆహారాలను మింగటం,
ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం.
ఆహారంలోని పిండి పదార్థాలు జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.
సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం.
కొవ్వు పదార్థాలు తినటం కడుపు ఉబ్బరానికి దోహదం చేస్తుంది. జీర్ణాశయం నుంచి ఆహారం త్వరగా పేగుల్లోకి వెళ్లకుండా కొవ్వు అడ్డుకుంటుంది.
ఒత్తిడి, ఆందోళన, పొగ తాగటం కడుపు ఉబ్బరానికి కారణమవుతాయి.
యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).
విరేచనౌషధాలను వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).
మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం.
ఇవన్నీ ఉదర సమస్యలు తయారవడానికి ప్రధాన కారణాలు.యోగ మీద అవగాహన ఉంటే ఉదరకోశవ్యాధులను నిరోధించుకోవచ్చు.

పవనముక్తాసనంతో ఉదరకోశవ్యాధుల నుంచి విముక్తి.

పవనముక్తాసనం:

పవనముక్తాసనం అనేది సంస్కృత పదం. మూడు పదాల మిశ్రం. ఇందులో పవన అంటే గాలి. ముక్త అంటే విడుదల. ఆసనం అంటే యోగాలో శరీర స్థితి. ఈ మూడు పదాల కలయికనే పవనముక్తాసనం అంటారు.ఈ ఆసనం ద్వారా ఉదరము, పేగులలోని అదనపు గాలి బయటకు వస్తుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదర సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ ఆసనం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

ఆసనం వేయు పద్దతి:

A) నేలపై వెల్లకిలా పడుకోవాలి.మీ భుజాలు నేలపై విస్తారం పరచండి.అరచేతులు నేల వైపు ఉండాలి.కాళ్ళను మెల్లగా వెనక్కు మడవాలి.పాదాలు నేలను తాకేటట్టు ఉండాలి.

B) తరువాతమెల్లగా ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోండి.ఈ స్థితి నుంచి కాళ్ళను  మడవాలి.

C) మోకాళ్ళను ఛాతీభాగం వైపు తీసుకురండి. అరచేతులను ఒత్తి పట్టాలి.

D)భుజాలు, తల భాగాన్ని నేలకు వ్యతిరేకంగా పైకి తీసుకురండి. తుంటి, పిరుదలను మెల్లగా పైకి లేవనెత్తండి.మోకాళ్ళను ఛాతీకి మరింత దగ్గరగా తీసుకురండి.మోకాళ్ళు, పాదాలు దగ్గరగా ఉండాలి.అయితే తల కిందకు దించరాదు.మడిచి ఉన్న మోకాళ్ళు, భుజాలను ఆలింగనం చేసుకునేలా ఉంచాలి.మోకాళ్ళను ఛాతీభాగాన్ని హత్తుకునేలా చేయండి.

ఈ స్థితిలో ఊపిరి బిగబట్టి 5 సెకనుల పాటు ఉండాలి.గాలి వదులుతూ మెల్లగా ఆసనం నుంచి అదే క్రమపద్దతిలో బయటకు రావాలి.భుజాలు, తల, కాళ్ళను నేలను తాకించి ఉపశమనం పొందాలి.

E) ఇలా పవనముక్తాసనం పలుమార్లు చేయాలి.

ఉపయోగలు:

కడుపు ఉబ్బరంగా ఉండేవారికి ఈ ఆసనం ద్వారా విముక్తి లభిస్తుంది.ఉదరంలో నిర్బంధంగా ఉన్న అదనపు గాలి తక్షణం వెలుపలికి వస్తుంది. ఉదరకోశ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వాత సంబంధ వ్యాధులను పోగొట్టును. కీళ్ళనొప్పులు గల వారికి అద్భుతమైన వర ప్రసాదంలా పనిచేయును. జీర్ణ శక్తిని పెంచును. పొట్ట వద్ద ఉండే అధికమైన కొవ్వును తొలగించును.
జాగ్రత్తలు:
వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ ఆసనం వేయవచ్చు.
గర్భంతో ఉన్నవారు, వెన్ను నొప్పి, సెర్వికల్ స్పాండిలైటిస్, హెర్నియా కలవారు చేయకూడదు.

నివారణ సూచనలు:

ఆహారాన్ని కొద్ది మొత్తాదుల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. ఆందోళనగా ఉన్నప్పడు ఆహారాన్ని హడావిడిగా తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా నమిలి తినాలి.
మసాలాలు, వేపుళ్ళు, అయిల్‌ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆల్కహాల్‌, స్మోకింగ్‌ మానివెయ్యాలి.
వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్ళు సరిపడినంతగా త్రాగాలి.నిల్వఉంచిన పచ్చళ్ళు తినడం మానివేయాలి.
పీచు పదార్థాలు ఉన్న తాజా వెజిటెబుల్స్‌ ఎక్కువగా తీసుకోవాలి.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva