సేతు బంధాసనం

సేతు బంధాసనంతో సయాటికా నొప్పి మాయం!

మన శరీరంలోని అన్ని నరాల్లోనూ పొడవైన నరం సయాటికా. ఇది కాళ్లు, పాదాలలోని పనితీరు, స్పర్శను నియంత్రిస్తుంది. ఈ నరంపై ఒత్తిడి కలిగితే వచ్చే నొప్పి వర్ణనాతీతం. దీనిఫలితంగా కాళ్లలో తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంట, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి యోగా మంచి పరిష్కారం. సయాటికా నొప్పి తగ్గాలంటే సేతు బంధాసనం ఆసనాలు చేయండి.సేతు బంధాసనం :
ఈ ఆసనం వేసినప్పుడు వంతెన ఆకారంలో వుంటుంది. సేతు అంటే వంతెన, కాబట్టి దీన్ని సేతుబంధాసనం అంటారు.

సేతు బంధాసనం(1) వేయు విధానం:

A)ముందు వెల్లకిలా పడుకోవాలి.కాళ్ళను మడిచి పాదములను పిరుదుల వద్ద ఉంచాలి.

B)ఇప్పుడు చేతులతో.. పాదాలను పట్టుకోవాలి.

C)శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును పైకి లేపాలి. చుబుకాన్ని ఛాతికి తాకించే ప్రయత్నం చేయాలి. ఇదియే సేతు బంధాసనం(1).
సుధీర్ఘ శ్వాసను తీసుకొని ఉండగలిగినంతసేపు శ్వాస వదులుతూ నడుమును మెల్లగా కిందకు దించాలి.

(D)సేతు బంధాసనం(2) వేయు విధానం:

సేతు బంధాసనం(C) వేసి చేతులను నడుము దగ్గర ఉంచి మోచేతులు నడుము క్రిందికి ఉండునట్లుగా నడుమును పైకి లేపాలి. ఇదియే సేతు బంధాసనం(2).
సుధీర్ఘ శ్వాసను తీసుకొని ఉండగలిగినంతసేపు శ్వాస వదులుతూ చేతులను నడుము దగ్గర నుంచి తీసుకుంటూ నెమ్మదిగా నడుమును కిందకు దించాలి.ఉపయోగం:

థైరాయిడ్, వెన్నుముక సమస్యలు నివారిచబడుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్, మలబద్ధకం, జీర్ణక్రియ సక్రమమగును. కాళ్ళు, చేతుల కండరాలు బలోపేతమవుతాయి. ముఖం కాంతివంతమగును. ఋతుక్రమం సక్రమమగును. జననేంద్రియ సమస్యలు, గర్భాశయ సమస్యలు తొలగించుకోవచ్చు.
దీనివల్ల నడుము నొప్పి తగ్గుతుంది. నడుము పట్టేయడం, తొందరగా లేవలేకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. సయాటికా నొప్పి తగ్గుతుంది. డయాఫ్రమ్ రిలాక్స్ అవుతుంది.

జాగ్రత్తలు:

కడుపులో మంట, పుండ్లు ఉన్నవాళ్లు చేయకూడదు. మెడనొప్పి, బిపి, హృద్రోగ సమస్యలు వున్నవారు ఈ ఆసనానికి దూరంగా వుండాలి. గర్భిణీలు ఈ ఆసనం అస్సలు వేయకూడదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva