యోగ ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును-వక్రాసనం,అర్థమత్స్యేంద్రాసనము

డయాబెటిస్ అనేది తీవ్ర అనారోగ్య సమస్య అయింది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి రోగుల సంఖ్య పెరుగుతోంది. నయం చెయ్యడం కుదరని ఈ వ్యాధిని నియంత్రించాల్సి వుంటుంది.

డయాబెటిస్ ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం మరియు రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత . అతిమూత్రం , దాహం ఎక్కువగా వేయడం, మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం మరియు బద్ధకం దీని ముఖ్య లక్షణాలు.  మధుమేహం సాధారణంగా రక్తంలో మితి మీరిన చక్కెర స్థాయిని బట్టి గుర్తిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత దేశం, చైనా, అెరికాలలో అత్యధికంగా ఈ వ్యాధి ప్రబలి ఉన్నది . ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు. జీవితాంతం తగిన జాగ్రత్తలు తీసుకొన్నట్లయితే దీన్ని అదుపులో ఉంచుకోవడం సాధ్యం.

యోగ ఆసనాల ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును.వక్రాసనం:

సంస్కృతంలో వక్ర అంటే వంకర అని అర్థం. వెన్నెముకను శరీరంలో ఒక వైపుకు వంకరగా తిప్పగలిగే ఆసనమే వక్రాసనం.

చేసే పద్ధతి:

A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

B)కుడికాలిని పైకి మడిచి ఎడమ మోకాలి వద్దకు మీ కుడిపాదాన్ని జరపండి.

C)ఎడమ చేతిని కుడి మోకాలు పై భాగాన నిటారుగా చాపి ఉంచండి.కుడి చేతిని వీపు వెనుక ఆధారం కోసం ఆనించండి.వెన్నెముకను నిటారుగా ఉంచి ఎడమ చేతితో కుడి కాలివేళ్లను పట్టుకోండి,  ఛాతీ భాగాన్ని మరింతగా కుడివైపుకు తిప్పి మెడను మీ వెనుక వైపుకు తిప్పి ఉంచండి, వీలైనంత సేపు ఈ  వక్రాసనంలో ఉండండి.

మెడను, ఛాతీ భాగాన్ని ముందువైపుకు తిప్పి, చేతిని వదిలి, కాళ్లను చాచండి. దండాసనం భంగిమలో కూర్చోండి.అర్థమత్స్యేంద్రాసనము:

మత్స్యేంద్రనాధుడనే మహాముని తపస్సు చేసిన ఆసనానకి మత్స్యేంద్రాసనమని పేరు.

అందరు సులభంగా చేయగలిగే ఆసనం అర్థమత్స్యేంద్రాసనము.

చేయు విధానం:

A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

B)కుడికాలిని పైకి మడిచి ఎడమ మోకాలి బైట వైపు  కుడిపాదాన్ని నేలకు తాకించవలెను.

D) ఎడమ కాలిని మెాకాలి వద్ద మడచి పాదమును కుడి పిరుదుకు తాకించవలెను.

ఎడమ చేతిని కుడి మెాకాలు చుట్టు తిప్పి, కుడి కాలి పాదని పట్టుకోవలెను.

E) కుడి చేతిని కుడివైపు వెనక్కి తిప్పి నడుముపై నుండి ఎడమ తొడపై ఉంచవలెను. ఇదియే అర్థమత్స్యేంద్రాసనము.

ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా తీయావలెను.

అదే విధంగా ఎడమ వైపు కూడా చేయవలెను.ప్రయోజనాలు:

వెన్నెముకను ఉత్తేజపరుస్తుంది. వీపు కుడి ఎడమ వైపులకు సులువుగా తిరిగేలా చేస్తుంది. జీర్ణవ్యవస్థకు మెత్తగా మర్దన జరుగుతుంది కాబట్టి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. నడుము పట్టడం, కండరాల నొప్పి తగ్గిపోతాయి. మెడపట్టకుండా, సులువుగా తిరగడానికి ఇది తోడ్పడుతుంది. కండరాలు, నరాలు  శక్తివంతంగా పనిచేస్తాయి. క్లొమ గ్రంధిని ఉత్తేజపరచి ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయిని పెంచును. అర్థమత్స్యేంద్రాసనము ద్వారా డయాబెటిస్ ను నియంత్రించవచ్చును.

జాగ్రత్తలు: మెడ నొప్పి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు. కీలు సంబంధ సమస్యలు ఉన్నవారు, స్పాండిలైటిస్ వ్యాధి ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు.

డయాబెటిస్ ను నియంత్రించుటకు:

చక్కెరవ్యాధిగ్రస్తులు ఆ జబ్బు గురించి అవగాహన పెంచుకోవాలి.

రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగ చేయాలి. తద్వారా శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. పాదాల మీద చర్మం కందిపోవడం, గాయాలు, పుండ్లు, ఏమైనా ఉన్నాయేమో గమనించాలి. డాక్టర్‌ సమక్షంలో అవసరమైన చికిత్స తీసుకోవాలి. గోళ్లు తీసే సమయంలో ఎక్కడా గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. పాదాలను ప్రతి రోజూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఇన్‌ఫెక్షన్లతో కాళ్లకు చీము పడితే చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలి. డాక్టర్‌ సలహాతో యాంటీబయాటిక్స్‌, అవసరమైతే ఇన్సులిన్‌ తీసుకోవాలి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌ పరీక్షలు, అలాగే కళ్లు, కిడ్నీ పరీక్షలు కూడా డాక్టర్‌ సలహా మేరకు చేయించుకోవాలి. మధుమేహం ఉన్న వారికి మూత్ర పిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల మూత్రంలో ఆల్బుమిన్‌ అనే ప్రొటీన్‌ విసర్జించబడుతుంది. అంతిమంగా ఇది కిడ్నీ దెబ్బ తినడానికి దారి తీస్తుంది. అందుకే ప్రతి ఆరు మాసాలకు పరీక్ష చేసి మూత్రంలో ఆల్బుమిన్‌ ఉందా లేదా కనుగొనాలి. మధుమేహం ఉన్న వారిలో గుండె కండరాలకు రక్తాన్ని కొనిపోయే కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. రక్తంలో త్వరగా కరిగిపోయే పీచు పదార్థాలు అధికంగా ఉండే  జామపండు తినలి.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva