శలభాసనం

ఈ ఆసనంలో మనిషి ఆకృతి మిడతలా ఉంటుంది. అందుకే ఈ ఆసనాన్ని శలభాసనం అని అంటారు.

శలభాసనం చేయు విధానం:

A)నేల మీద రెండు కాళ్లూ చాచి బోర్లాపడుకోవాలి, ముఖం నేలమీద వాల్చి చేతులు వెనుకకు చాపాలి.

B)చేతులు శరీరానికి సమాంతరంగా కాళ్ల కిందుగా ఉంచాలి. అరచేతులు తొడలకు తాకించి ఉంచాలి.

C) నెమ్మదిగా గాలి పీల్చుకుని ఎడమ కాలును వీలున్నంతపైకి లేపి 5 నుంచి 8 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. ఇలా అనేకా సార్లు చేయాలి. ఇది ఏకపాద శలభాసనం.

D)నెమ్మదిగా గాలి పీల్చుకుని కుడికాలును వీలున్నంతపైకి లేపి 5 నుంచి 8 సెకన్లపాటు ఆ స్థితిలో ఉంచాలి. గాలి వదులుతూ నెమ్మదిగా కాలు కిందికి తీసుకురావాలి. ఇలా అనేకా సార్లు చేయాలి. ఇది ఏకపాద శలభాసనం.

E)ఊపిరి వదిలి, తల, ఛాతీ, రెండు కాళ్లూ ఒకసారి వీలైనంత పైకి ఎత్తాలి. పక్కటెముకలు గానీ, మోచేతులుగాని నేల మీద ఆనకుండా కేవలం పొట్ట మాత్రమే నేల మీద ఉండి శరీరం బరువునంతా మోస్తూ ఉండాలి. పిరుదు కండరాలను సంకోచింపచేసి, తొడల దగ్గర కండరాలను సాగతీయాలి. రెండు కాళ్లను పూర్తిగా చాపి ఉంచాలి. తొడల దగ్గర మొకాళ్ళు, చీల మండలాలు తాకుతూ ఉండాలి.శరీరం బరువును చేతుల మీద మోపకూడదు. ఈ స్థితిలో ఒకటి రెండు నిముషాలు ఉండాలి, శ్వాసక్రియ మామూలుగానే ఉండాలి.
కాలు పైకి లేపి ఉంచినప్పుడు మోకాలి వద్ద వంచకుండా ఉండాలి.

ప్రారంభంలో ఛాతీని, కాళ్లను పైకి ఎత్తడం కష్టమనిపించినా కొన్నాళ్ల సాధన తరువాత అది సులువవుతుంది.

నడుము కింద నొప్పి ఎక్కువగా ఉన్నవారు ఈ ఆసనంలో కాళ్లను వెనుకకు ముడుచుకోవాలి. తొడలను ఎడం చేసి నేలకు నిలువుగా ఉండాలి.శలభాసనం ఉపయోగాలు:

ఈ ఆసనం వాళ్ళ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బిగుసుకుపోయిన వెన్నుముక సాగుతుంది. వెన్నునొప్పి, నడుమునొప్పి తగ్గుతాయి. వెన్నుపూస పక్కకు జరగడం వల్ల తలెత్తిన నొప్పి నుంచి ఈ ఆసనంతో ఉపశమనం కలుగుతుంది. రోజు క్రమం తప్పకుండా వేస్తే వీరికి శస్త్ర చికిత్స అవసరం కూడా తప్పుతుంది. వీటినన్నిటిని మించి ఈ ఆసనం వల్ల మూత్రకోశ సమస్యలు తగ్గుతాయి.
శలభాసనం పొట్టకు, తుంటి భాగానికి, కాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని తొలగిస్తుంది. నడుము సన్నబడుతుంది. శలభాసనంతో గర్భసంచి, అండాశయాలలో ఏవైనా లోపాలు వుంటే తొలగిపోతాయి. మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. కాళ్ళు, చీలమండ వాపులకు ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. నరాల వాపు, మొలలు నివారించబడుతాయి. కాలేయం d d పనిచేయడానికి దోహదపడుతుంది. కడుపుబ్బరం తగ్గుతుంది. ఉదరకోశవ్యాధులు, గాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి.

సూచన:
ఇందులో ఏకపాద శలభాసనం (కుడి-ఎడమ) అందరూ చేయవచ్చు.
ద్విపాద శలభాసనం గుండె రోగులు,హెర్నియా, హైబిపి కలవారు, గర్భిణి స్త్రీలు చేయకూడదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva