సుప్తవజ్రాసనం

హిప్స్ & తొడల ఆకృతిని మెరుగుపరుచుకునే సుప్తవజ్రాసనం:

సాదారణంగా శరీరంలోని దిగువ ప్రాంతంలో బరువు పెరిగే ధోరణి ఉంటుంది. నిపుణులు ప్రకారం తుంటి భాగము మరియు తొడల వద్ద బరువు అనేది సవాలుతో కూడుకున్నది. మీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి మరియు సహజంగా కొవ్వు బర్న్ అవటానికి రోజు వారి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలి.
రెండు గంటల కంటే ఎక్కువ సేపు కూర్చొని ఉండకూడదు. తుంటి భాగము మరియు తొడల ప్రాంతంలో బరువు కోల్పోవడానికి సుప్తవజ్రాసనం చేయడం ఉత్తమ మార్గం.సుప్తవజ్రాసనం : సుప్త అనగా పడుకోడం వజ్రాసనంలో కూర్చొని నేల మీద వెల్లకిలా పడుకొని ఆచరించే ఆసనం ఇది. అందుకే దీనిని సుప్త వజ్రాసనం అంటారు.

సుప్తవజ్రాసనం వేయు విధానం:

A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

B(వజ్రాసనం) మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. రెండు పాదాల మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి.C) ఇప్పుడు నెమ్మదిగా వెనక్కి వంగుతూ మొత్తం శరీర బరువు మొదట కుడి మోచేతి పైన తర్వాత ఎడమ మోచేతిపైన వుంచాలి. అరచేతులు రెండు వైపుల పాదాల పక్కన వుంటాయి. అవసరమైతే పాదాలను పట్టుకోవచ్చు.

D) మోచేతుల సాయంతో వెనక్కి వస్తూ తలపై భాగం మాడని నేలపై వుంచాలి. రెండు అరచేతులను తొడలపై పెట్టాలి. మోకాళ్ళ మధ్య నాలుగు వేళ్లంత గ్యాప్‌ వుండాలి. ఇదియే సుప్తవజ్రాసనం.

ఈ ఆసనంలో సహజ శ్వాసతో అరనిమిషం నుండి రెండు నిమిషాల వరకు వుండవచ్చు. తర్వాత నెమ్మదిగా మోచేతుల సాయంతో యథాస్థితికి రావాలి.

సుప్తవజ్రాసనం ఉపయోగాలు:

తొడలలో చేరిన కొవ్వుని కరిగిస్తుంది. ఆస్తమా, బ్యాక్‌పెయిన్ నుంచి ఉపశమనాన్నిస్తుంది. మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లకు మంచి ఫలితాలనిస్తుంది. గొంతు సమస్యలు తొలగిపోయి స్వరంలో స్పష్టత వస్తుంది. వెన్ను సాగదీయబడి శక్తి వంతమవుతుంది. గూని, బ్యాక్‌పెయిన్‌ రాకుండా చేస్తుంది.
శ్వాస నిండుగా తీసుకోబడుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. దీని వలన ఆస్త్మా వంటి శ్వాస సమస్యలు అదుపు జేయబడుతాయి.
కాళ్ళు, తొడ కండరాల బిగుసుతనం పోతుంది. సులభంగా కదలడానికి, ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోవడానికి వీలగును. ఉదరం, మెడ, తుంటి భాగంలో రక్తప్రసరణ బాగా జరిగి వాటికి ఆరోగ్యం చేకూరుతుంది. మలబద్దకం, థైరాయిడ్‌, గొంతు సమస్యలు మోకాళ్ళనొప్పులు నివారింపబడుతాయి. గ్రంథులన్నిటిని ఉత్తేజపరుస్తుంది.జాగ్రత్తలు:

సర్వికల్‌ స్పాండిలైటిస్‌, గుండెజబ్బులూ, సయటికా వున్న వారు, మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్న వాళ్లు చేయకూడదు.
అధిక బరువు ఉన్నవాళ్లు జాగ్రత్త చేయాలి.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva