వజ్రాసనం

వజ్రాసనం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రంలా చేస్తుంది…. క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో ‘వజ్ర’ అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది.

మిగతా అన్ని ఆసనాలను ఎప్పుడు పడితే అప్పుడు వేయడం సరైనది కాదు. కానీ వజ్రాసనాన్ని 24 గంటల్లో ఎప్పుడైనా వేయొచ్చు. ఈ ఆసనంలో మెడిటేషన్ చేయొచ్చు, ప్రాణాయామం చేయొచ్చు….ఆస‌నం వేయు విధానం:

A) కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

B)మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌ వేలు కుడికాలి బ్రోట‌న వేలు దగ్గరగా వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి.

C)రెండు పాదాల లోప‌లి భాగం ‘V’ ఆకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి.

D)రెండు అరిచేతులు తొడ‌లు పై వుంచాలి. మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చ‌కుండా నిశ్చలంగా వజ్రాసనంలో వుండాలి.
A)మరలా కాళ్లను ముందుకు చాపి దండాసన పద్ధతిలో కూర్చోవాలి.

వజ్రాసనంలో మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ మేలు జ‌రుగుతంది. ఆస‌న‌ము నుంచి బ‌య‌ట‌కు రావాల‌నుకున్నపుడు మోకాళ్ల పై నుంచి చేతుల‌కు విరామం క‌లిగించాలి. త‌రువాత ఒక్క కాలిని ఒక్కసారి ఇంకో కాలిని ఒక్కసారి ముందుకు సాంచి ఆసనం నుంచి బ‌య‌ట‌కు రావాలి.వజ్రాసనం భంగిమలోనే బ్రీతింగ్ వ్యాయామం మరియు మెడిటేసన్ వంటివి చేయవచ్చు.

వజ్రాసనం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు:

భోజనం అనంతరం వజ్రాసనం వేసిన జీర్ణాశక్తిని పెంచును. మన శరీరంలో అవయవాల మీద ఒత్తిడిని కలిగించే ఆసనం ఇది . ఈ ఆసనం యొక్క భంగిమ పొత్తికడుపు, పొట్ట మరియు ప్రేగుల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మరియు దాంతో మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వజ్రాసనంతో ఇది ఒక గొప్ప ప్రయోజనం. ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేప్పుడు, మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. వజ్రాసన భంగిమ వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం, మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. వజ్రాసన వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం. కొన్ని వ్యాధులను చాలా సులభంగా తగ్గించడంలో వజ్రాసనం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఈ వజ్రాసనం భంగిమ వల్ల వెరికోస్ వైన్స్, కీళ్ళ నొప్పులు, మరియు ఆర్థ్రరైటిస్ వంటి వ్యాధులను నివారిస్తుంది . ఈ వజ్రాసనం రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వజ్రాసనం వల్ల జాయింట్ మరియు మజిల్ యొక్క వ్యాధులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
వజ్రాసనంతో మరో ప్రయోజనం ఫ్యాట్ కరగడంతో పాటు, బరువు క్రమంగా తగ్గించబడుతుంది . ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బాడీటోన్ అవుతుంది మరియు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.జాగ్రత్తలు: మెాకాలు నొప్పి ఉన్నవారు చేయరాదు. మడిమలు ఎక్కువ నొప్పి వచ్చేంత వరకు ఆస‌నంలో ఉండరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva