చక్రాసనము

ఈ ఆసనం చక్రం ఆకారంలో ఉంటుంది కనుక దీనికి చక్రాసనమని పేరువచ్చింది.

చక్రాసనము ఆస‌నం వేయు విధానం:

మొదట వెల్లకిలా పడుకోవాలి.
A) పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి.
చేతులను పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి.

B) చేతుల సాయంతో నడుమును వీలైనంత పైకి ఎత్తాలి. తలను నేలపై ఆనించాలి.

C) సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. మెడ కిందికి వేలాడుతుండాలి. ఇదియే
చక్రాసనము.

B) ఉండగలిగినంతసేపు ఈ స్థితిలో ఉన్న తరువాత మెల్లమెల్లగా తలను నేలపై ఆనించాలి.

నడుమును గూడా ఆనించి తర్వాత కొద్ది క్షణాల సేపు శవాసనం వేసి విశ్రాంతి తీసుకోవాలి.సూచన:

ప్రారంభదశలో తలను నేలపైననే ఆనించి అర్థ చక్రాసనం(B) అభ్యాసం చేయవచ్చును. చేతులపై శరీరం బరువును ఆపగలమన్న ధైర్య కలిగేవరకు తల ఆనించి అభ్యాసం కొనసాగించవచ్చును.

చక్రాసనము ఉపయోగం:

1. వయస్సు పెరగకుండా చేయును.

2. ముఖము కాంతివంతమగును.

3. వెన్నుముక బలోపేతమై ధ్యాన సాధనకు ఉపయోగపడును.

4. థైరాయిడ్, గ్యాస్ట్రిక్, మలబద్ధకం తొలగును.

5. చేతి కండరాలు, తొడలు, కాలి కండరాలు బలోపేతమగును.

6. ఆస్త్మా, సైనస్ వంటి శ్వాస సంబంధిత సమస్యలు తొలగును.

7. ఋతుక్రమము సక్రమమగును. గర్భాశయం పటిష్టమగును.

8. శక్తి, ఉత్సాహం కలిగి శరీరం తేలికగా ఉండును. లైంగికశక్తి వృద్ధియగును.

9. ఊపిరితిత్తులు ఎక్కువ ఆక్సిజన్ ను తీసుకొని రక్తము చక్కగా పరిశుద్ధమగును.

10. షడ్‌చక్రాలు ఉత్తేజితమగును.*షడ్‌చక్రాలు* :

1) మూలాధార చక్రము:
పిరుదుల స్థానమునకు పైన, లింగ స్థానమును క్రిందుగా నున్నది. నాలుగు దళములతో అరుణ వర్ణము కలిగిన భూమితత్వ కమలమిది. ఇందే కుండలినీ శక్తి యుండును.

2) స్వాధిష్ఠాన చక్రము:
లింగమూలమున గలదు. ఆరు దళములతో సింధూరవర్ణము గల జలతత్వ కమలము గలది.

3) మణిపూరక చక్రము:
నాభి మూలమందు గలదు. పది దళములు గలిగి నీల వర్ణము గల అగ్ని తత్వ కమలము.

4) అనాహత చక్రము:
హృదయ స్థానమునందున్నది. పండ్రెండు దళములు గలిగి హేమవర్ణము గల వాయుతత్వ కమలము.5) విశుద్ధి చక్రము:
కంఠ స్థానమందున్నది. పదునారు దళములు గలిగి శ్వేత వర్ణము గల ఆకాశతత్వ కమలము.

6) ఆజ్ఞా చక్రము:
భ్రూ (కనుబొమల) మధ్యమందున్నది. రెండు వర్ణములతో గూడిన రెండు దళములు కలిగిన కమలము.

చక్రాసనము చేయాకుడానివారు:

అధిక రక్తపోటు ఉన్నవారు, కన్ను, ముక్కు, గొంతుకకు సంబంధించిన రోగ గ్రస్తులు, గర్భంతో ఉన్నవారు, వెన్ను నొప్పి ఉన్నవారు చేయరాదు.

By Siva Kumar
Yoga Trainer
FB ID:

smartyogasiva