Natural way of weight loss -బరువు తగ్గించే సహజ మార్గం

ఈరోజుల్లో శరీర బరువు అనేది పెద్ద సమస్య గ మారిపోయింది ఎప్పుడు ఎలా పెరుగుతామో తెలియకుండా శరీర బరువు అమాంతంగా పెరిగిపోతుంది దానికి తోడు ఎలాంటి వ్యాయామం లేక పోయే సరికి ఇంకా బరువు పెరిగిపోతాం. అధికంగా తినకపోయినా సరే బరువు పెరిగిపోతాం కారణం జంక్ ఫుడ్ కనీస వ్యాయామం లేకపోవడం కూర్చొని టీవీ చూడటం,కంప్యూటర్ వాడటం.ఒక్కసారి ఇంట్లో వాళ్ళో లేక స్నేహితోలో బరువు తగ్గమని సలహా ఇవ్వటం తో మనం ఆ పనిని మొదలు పెడతాం, ఉరుకులు పరుగులు నానా బీభత్సము చేస్తాం ఒక వారం రోజులు తర్వాత మల్లి మొదటికె వస్తుంది.

కొన్ని రోజులు తరవాత మరల ఎక్కడినించో సలహా వస్తుంది లేక పోతే డాక్టర్ గారు గట్టిగ చెప్పడం జరుగుతుంది. ఈసారి ఉరుకులు పరుగులు కాకుండా మన గూగుల్ సహాయం తీసుకుంటారు ఇక చూడండి ఇలా చేస్తేయ్ పది రోజులు లో పది కిలోలు తగ్గుతారు, ఇది తాగితేయ్ కొవ్వు కరిగిపోతుంది అని ఏవేవో చేసి లేని రోగాలను అంట గట్టుకుంటాం.  దయ చేసి ఇలాంటివి నమ్మకండి.

ఒక్క రోజులో పెరిగిన బరువు కాదు ఒక్క రోజులో పోగొట్టుకోవడానికి.

సహజంగా బరువు తగ్గటానికి చూడండి కానీ షార్ట్ కట్స్ చూసుకొని అనవసరమైన రోగాలను తెచ్చుకోకండి.

సహజంగా బరువు తగ్గే చిట్కాలు :

* మొదటిగా మీరు రోజు తినే ఆహారాన్ని మరియు ఆ సమయాన్ని మార్చుకోండి.

    రోజు తినే ఆహారం మరియు ఆ సమయం ఎందుకు మార్చుకోవాలంటే వాటిలో మార్పు వచ్చింది కాబట్టి మీరు బరువు పెరిగారు.

* ప్రొసెస్డ్ ఫుడ్ అంటే పాకెట్స్ లో దొరికిదే మరియు జంక్ ఫుడ్ తినకండి.

              ఇవీ తినడం వల్ల సరిగా అరగకపోగా కొవ్వు చేరుతుంది.

* సహజంగా దొరికే పండ్లు , తాజా కూరగాయలు మరియు మాంసాహారం మాత్రమే తీసుకోండి.

* ఉపవాసాలు ,మాంసాహారాన్ని మానేయటాలు రాత్రి తినకుండా పడుకోవటాలు అస్సలు చేయకండి.

శరీరానికి సరైన పోషకాలు కావాలి అందుకనే వీటిని తినడం ఆపకూడదు.* ఏది తిన్న మోతాదు లో తినండి.ఎక్కవగా నీళ్లు తాగటం అలవాటు చేసుకోండి.

కొద్దిగా ఆహారం తక్కువగా తీసుకోవాలి అది మనం నిర్ణయించుకోవాలి.

* ఉదయాన్నే లేవగానే పరిగడుపున వేడి నీళ్లు కానీ నార్మల్ నీళ్లు కానీ 4 గ్లాసెస్ నించి 5 గ్లాసెస్ త్రాగాలి.

మంచి నీళ్లు మలినాలను తీసేస్తుంది మరియు కొవ్వుని కరిగిస్తుంది.

*వాకింగ్ ,జాగింగ్,స్విమ్మింగ్ మరియు రన్నింగ్ చేయాలి.

మన పూర్వికులు కష్టపడి పని చేసే వారు కనుక వారికీ పొట్ట ఉండేది కాదు మనం ఎలాగూ ఆలా చేయ లేము కాబ్బటి సహజంగా చేసేయ్ నడక,పరుగు చేయొచ్చు.జాగింగ్ ఎందుకంటే మనలో వాకింగ్ అనగానే మెల్లిగా నడిచేవాళ్ళు ఉంటారు అది ఎంత మాత్రమూ శరీర బరువు తగ్గటానికి ఉపయోగ పడదు అందుకనే జాగింగ్.

*రన్నింగ్ మీ సమర్ధయాన్ని బట్టి చేసుకోవాలి.

             అందరికి రన్నింగ్ చేయటం కుదరదు అందుకనే.*వెల్లుల్లి,తేనె ,నిమ్మకాయ రసం తరుచు తీసుకుంటూ ఉండాలి.

               సహాంజంగా కొవ్వు తగ్గించేవి.

* యోగ చేస్తుండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం.

యోగ బరువు తగ్గిస్తుంది కానీ మన శరీరం అందుకు సహకరించాలి అందుకనే మానసిక ఒత్తిడి తగ్గించే ప్రాణాయం,ధ్యానం చేయాలి.

* వారం లో కనీసం ౩ రోజులైనా జిమ్ కెళ్ళి కార్డియో ,వర్కౌట్స్ చేయాలి.

        నేను చాల బిజీ రోజు జిమ్ వెళ్ళటం కుదరదు అందుకనే మూడు రోజులు ఐన పర్వాలేదు.

* మాంసాహారం తినే వాళ్ళు మటన్ ,చికెన్ కంటే ఎక్కువ చేపలు తినాలి.

        మాంసాహారులు చికెన్ ,మటన్ తో పాటు లేదా వాటికీ బదులు చేపలను తినాలి.

అసలు ఇవన్నీ నా వల్ల కాదు అనుకుంటే ఇంట్లో మీ పని మీరు చేసుకోండి మీ ఇంట్లో వల్ల పనికైనా సహాయం చేయండి.
లేదంటే గార్డనింగ్ ,క్లీనింగ్(హౌస్,వెహికల్స్),పిల్లల్తో ఆడుకోవటం,సైక్లింగ్,లిఫ్ట్ కీ బదులు మెట్లను ఉపయోగించటం.సూచనా : అతిగా ఏది చేయకండి ,తొందరగా బరువు తగ్గాలి అని చూడకండి.